Sudan : ఆగ్నేయ సూడాన్‌లోని సెన్నార్‌లోని మార్కెట్‌లో షెల్లింగ్‌లో 21 మంది మరణించారు, 67 మంది గాయపడ్డారు. పారామిలటరీ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. ఏప్రిల్ 2023లో యుద్ధం ప్రారంభమైన తర్వాత స్థాపించబడిన సుడాన్ డాక్టర్స్ నెట్‌వర్క్ ఇలాంటి మరణాలను నివేదించింది. అయితే గాయపడిన వారి సంఖ్య 70 కంటే ఎక్కువ అని పేర్కొంది.
పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) షెల్లింగ్‌కు పాల్పడింది. మహ్మద్ హమ్దాన్ డాగ్లో నేతృత్వంలోని ఆర్ఎస్ఎఫ్ దేశం వాస్తవ పాలకుడు అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ ఆధ్వర్యంలోని సూడాన్ దళాలతో పోరాడుతోంది. ఆర్‌ఎస్‌ఎఫ్ క్రమపద్ధతిలో పౌరులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని ప్రభుత్వం గతంలో ఆరోపించింది.
Read Also:Lord Shiva Stotram: ఈ స్తోత్రాలు వింటే దరిద్రాలు పోయి సకల సంతోషాలు మీ సొంతమవుతాయి
85 మంది హత్య
అంతకుముందు ఆగస్టు నెలలో కూడా సుడాన్‌లోని ఒక గ్రామంపై పారామిలటరీ గ్రూపు ఫైటర్లు దాడి చేశారు. ఇందులో మహిళలు, పిల్లలు సహా కనీసం 85 మంది హత్యకు గురయ్యారు. ఇళ్లకు నిప్పు పెట్టారు, విధ్వంసం కూడా జరిగింది. ఈ ఆర్‌ఎస్‌ఎఫ్ దాడిలో 150 మందికి పైగా గ్రామస్తులు గాయపడ్డారని సూడాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సూడాన్‌లో పరిస్థితి దారుణం
ఏప్రిల్ 2023లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, దేశవ్యాప్తంగా మారణహోమం, అత్యాచారం, ఇతర తీవ్రమైన ఉల్లంఘనలకు ఆర్ఎస్ఎఫ్ పదేపదే ఆరోపణలు ఎదుర్కొంటుంది. సూడాన్‌లో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం.. పోరాటం ప్రారంభమైనప్పటి నుండి 10.7 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. వీరిలో రెండు మిలియన్లకు పైగా పొరుగు దేశాలకు పారిపోయారు.
Read Also:Nigeria : ఫ్యూయల్ ట్యాంకర్-ట్రక్ ఢీకొనడంతో పేలుడు, 48 మంది మృతి, 50 పశువులు సజీవ దహనం