ACB Raids: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. తొలిరోజు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. రెండో రోజు కూడా మరికొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.. అవినీతి, అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి సహా మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం…
Registrations : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలు అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకరణ కొనసాగుతున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. మొదటి దశగా రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 22 కార్యాలయాల్లో ఈ విధానం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి…
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులైనా కూడా పనిచేశాయి. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావటంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు…
Ponguleti Srinivas Reddy : ప్రజలకు మరింత మెరుగైన సేవల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునఃవ్యవస్థీకరణ చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు, మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. అవసరమైన భూములను…
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పోకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్లుశాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా.. విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ పోడియంను రెవెన్యూ సీఎస్ సిసోడియా స్వయంగా పగలగొట్టారు.
Sub-Registrar Office: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్ ల శాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్య ప్రసాద్ ప్రతిపాదనలు పంపారు.
ఏపీ సర్కార్ తెచ్చిన కార్డ్ 2.0 సాఫ్ట్‌వేర్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. డిజిటలైజేషన్‌లో భాగంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో అనుసంధానం చేయడం, ఈకేవైసీ కోసం చేసిన ఏర్పాటు.. కొత్త సమస్యలకు కారణమవుతోంది. రెగ్యులర్‌గా జరిగే సేవలు తప్ప మిగిలినవి అన్నీ ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవకతవకలు ప్రభుత్వ ఆదాయినిక భారీగా గండి కొట్టాయి.. దీంతో.. అప్రమత్తం అయిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. అవకతవకలకు చెక్‌పెట్టే విధంగా అడుగులు వేస్తోంది.. దీనిపై మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను హెచ్‌వోడీ కార్యాలయాలకు అనుసంధానం చేసే…