AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని…