భారతదేశంలో ‘స్టైల్ కింగ్’ అని పేరు సంపాదించిన తొలి స్టార్ హీరో దేవానంద్. రొమాంటిక్ హీరోగా దేవానంద్ సాగిన వైనం ఈ నాటికీ అభిమానుల మదిలో చెరిగిపోకుండా నిలచిఉంది. దేవానంద్ స్టైల్స్ చూసి ఆయనను అభిమానించిన అందాల భామలెందరో ఉన్నారు. అలాగే అబ్బాయిలు దేవ్ స్టైల్స్ ను అనుకరిస్తూ ఆ రోజుల్లో సందడి చేసిన సందర్భాలు కోకొల్లలు. భారతీయ సినిమాకు దేవానంద్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. దేవ్…