కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు.. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఇక, థర్డ్ వేవ్ ఎక్కువ చిన్నారులపైనే ప్రభావం చూపబోతుందంటూ పలు హెచ్చరికలు ఉన్నాయి.. అయితే, పెద్దవారి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోన్న మహమ్మారి.. చిన్నారులపై ఊపిరితిత్తులను ఏ స్థాయిలో దెబ్బతీస్తుందనేదానిపై అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు.. కానీ, కోవిడ్ వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఉన్నవారి ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపదని.. కోవిడ్ బారినపడినా.. వారి అవయవాల పనితీరులో పెద్దగా మార్పులు రావని గుర్తించారు శాస్త్రవేత్తలు.…
ప్రపంచంలో చాలా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి తరం కరోనా వైరస్ కంటే మ్యూటేషన్ల తరువాత వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు ప్రపంచంలో అత్యధికంగా పెరుగుతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందడంతో పాటుగా మరణాల సంఖ్యను కూడా ఈ వేరియంట్ పెంచుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను తప్పించుకునే గుణం కలిగి ఉండటంతో ఈ వేరియంట్ కట్టడి కష్టంగా మారింది. అయితే, డెల్టా వేరియంట్ తో బాధపడే బాధితుల్లో ఈ వేరియంట్ 300 రెట్లు అధికంగా…
ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సామెతను తీసుకొని మానవ శరీరంలో యాంటీబాడీలను ఏమార్చి ఇన్‌ఫెక్షన్లను కలుగజేస్తున్న కరోనా వైరస్‌ను బోల్తాకొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికోసం కొన్ని లోపాలున్న వైరస్‌ను సృష్టించారు. ఈ లోపాలున్న వైరస్ కరోనా వైరస్ తో ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. అంతేకాదు, ఆ ప్రక్రియ తరువాత లోపాలున్న కృత్రిమ కరోనా వైరస్ కూడా అంతం అవుతుంది. మానవ శరీర…
ఆనందయ్య మందుకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతిలోని ఆయుర్వేద కళాశాలలో పరిశోధన కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య దగ్గర మెడిసిన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు వైద్యలు. నిన్నటి రోజున 190 మందికి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. అయితే, ఫోన్ ద్వారా వివరాలు సేకరించే సమయంలో వైద్యులకు సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్యకార్యకర్తల నెంబర్లు ఇచ్చినట్టు వైద్యుల…
ఇప్పుడు భారత్‌లో బయటపడిన కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచదేశాలను వణికిస్తోన్నాయి.. భారత్‌లో గుర్తించిన బి.1.617, బి.1.618 వేరియంట్లు.. చాలా దేశాలకు పాకింది.. సమస్యగా కూడా మారిపోయింది. అయితే భారత్ వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని యూఎస్‌కు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసన్, లాంగోన్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షలో గుర్తించారు.. ఆ రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తుల నమూనాలను సేకరించిన పరిశోధకులు.. భారత్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్లతో కలిపి…
కరోనా కేసులు దేశంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. బి.1.617, బి.1.618 తో పాటుగా ఎన్ 440 కె రకం వేరియంట్ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిపై చేసిన పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. మొదటి దశలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించిన కరోనా, రెండో దశలో ఒకటి నుంచి ఏకంగా ముగ్గురికి వ్యాపిస్తున్నట్టు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్…