ప్రపంచంలో చాలా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి తరం కరోనా వైరస్ కంటే మ్యూటేషన్ల తరువాత వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు ప్రపంచంలో అత్యధికంగా పెరుగుతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందడంతో పాటుగా మరణాల సంఖ్యను కూడా ఈ వేరియంట్ పెంచుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను తప్పించుకునే గుణం కలిగి ఉండటంతో ఈ వేరియంట్ కట్టడి కష్టంగా మారింది. అయితే, డెల్టా వేరియంట్ తో బాధపడే బాధితుల్లో ఈ వేరియంట్ 300 రెట్లు అధికంగా వైరస్ లోడ్ ఉన్నట్టుగా శాస్త్రవేత్తల పరిశోధనలతో తేలింది. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. డెల్టావేరియంట్ సోకిన 1848 మందిని ఇతర వేరియంట్లు సోకిన 22,106 మంది బాధితులపై చేసిన పరిశోధనలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైరస్‌లోడ్ 300 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ, వ్యాప్తి ఆ స్థాయిలో లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: మగువలకు షాకిచ్చిన పుత్తడి…భారీగా పెరిగిన ధరలు…