SRM University: గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సెలవులు ప్రకటించారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రెండు వారాలపాటు…
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృత్యుఒడికి చేరుకున్నాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతి సింగారం.
మాదాపూర్లోని సున్నం చెరువు చెంత బోర్లు వేసి.. ఆ నీటితో ప్రజల ఆరోగ్యానికి కన్నం పెడుతున్నారు ఇక్కడి నీటి వ్యాపారులు. అక్రమంగా బోర్లు వేసి.. కలుషిత జలాలతో మాదాపూర్ పరిసరాల్లో ఉన్న హాస్ట ళ్ల విద్యార్థుల భవిష్యత్ను అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఐఐటీతో పాటు.. వైద్య విద్యనభ్యశించడానికి ఉత్తమ ర్యాంకులు రావాలని ఆశిస్తూ అహర్నిశలూ కష్టపడుతున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సున్నం చెరువు చెంతకు వెళ్తేనే దుర్వాసన భరించలేం. ఇలాంటి చోట బోర్లు వేసి ఆ…
ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం ఉందని తేలితే ఇంటికి పంపుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేసిన అభివృద్ధిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా ఆంక్షలు విధించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనెల 20వరకూ ఆంక్షలు వున్నా అవి సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్ధులకు నిర్వహించనున్న వివిధ పరీక్షలు రద్దవుతున్నాయి. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బీడీఎస్ పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కోవిడ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ సోకిన…