క్రికెట్ ఆటలో ఎవరూ ఊహించని పలు రికార్డులు నమోదవుతుంటాయి. మైదానంలో ఎప్పటికప్పుడు ప్రపంచ రికార్డులు బద్దలు అవుతూనే ఉంటాయి. అలాంటి ఒక రేర్ రికార్డు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 145 సంవత్సరాల టెస్ట్ క్రికెట్‌లో ఎన్నడూ సాధించని రికార్డును ఓ టీమిండియా బౌలర్ బ్యాటింగ్‌లో బద్దలు కొట్టాడు. ఈ రికార్డు స్టార్ బ్యాట్స్‌మెన్‌లకు కూడా సాధ్యం కాలేదు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
2022 సంవత్సరంలో బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్)లో ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య 5వ టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్‌లో రెండవ రోజు భారత ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. జట్టు స్కోరు 9 వికెట్లకు 377 పరుగులు. బుమ్రా, మహమ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 35 పరుగులు వచ్చాయి. 29 పరుగులు బుమ్రా బ్యాట్ నుండి రాగా.. మిగిలినవి అదనపు పరుగులు. ఇది 145 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. బ్రాడ్ అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
మొదటి బంతి:
బ్రాడ్ బౌలింగ్ వేశాడు. బుమ్రా బంతిని బలంగా బాధగా వికెట్ కీపర్ మీదుగా బౌండరీ వెళ్ళింది.
రెండవ బంతి:
బౌన్సర్‌ను చాలా ఎత్తులో విసిరగా అంపైర్ వైడ్ ఇచ్చాడు. అందంగా బౌండరీ కూడా దక్కింది. అంటే ఒకే బంతికి ఐదు పరుగులు వచ్చాయి.
మూడవ బంతి:
బ్రాడ్ మళ్ళీ బౌన్సర్ వేయడానికి ప్రయత్నించాడు. బ్రాడ్ పాదం క్రీజు వెలుపల ఉండడంతో నో-బాల్ వచ్చింది. బుమ్రా సిక్స్ కొట్టాడు. నో-బాల్‌కు 1 పరుగు + సిక్స్‌కు 6 పరుగులు = 7 పరుగులు వచ్చాయి.
నాల్గవ బంతి (రెండవ బంతి):
బ్రాడ్ ఫుల్ లెంగ్త్ డెలివరీ వేశాడు. దానిని బుమ్రా మిడ్-ఆన్ మీదుగా ఫోర్ కొట్టాడు.
ఐదవ బంతి (మూడవ లీగల్ డెలివరీ):
బ్రాడ్ యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు కానీ బుమ్రా దానిని ఇన్‌సైడ్-ఎడ్జ్‌గా తిప్పి ఫైన్ లెగ్ వైపుకు బౌండరీగా పంపాడు.
ఆరో బంతి (నాల్గవ లీగల్ బంతి):
బుమ్రా లెగ్ సైడ్ వైపు ఫోర్ కొట్టాడు.
ఏడో బంతి (ఐదవ లీగల్ బాల్):
బ్రాడ్ మళ్ళీ బౌన్సర్ వేశాడు. డీప్ మిడ్-వికెట్ మీదుగా బుమ్రా సిక్స్‌గా కొట్టాడు.
ఎనిమిదో బంతి (ఆరవ లీగల్ బాల్):
బ్రాడ్ చివరికి ఓ మంచి లెంగ్త్ డెలివరీ వేశాడు. బుమ్రా సింగిల్ తీశాడు. ఈ విధంగా ఒక ఓవర్లో మొత్తం 35 పరుగులు వచ్చాయి. అందులో బుమ్రా 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. 6 పరుగులు ఎక్స్‌ట్రాలు (వైడ్ మరియు నో-బాల్).