విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తల పెట్టిన సమ్మె వాయిదా వేశారు.. వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు మొదట నోటీసులు ఇచ్చింది అఖిలపక్షం.. అయితే, కార్మిక సంఘాలతో ఇవాళ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్, ఆర్.ఐ.ఎన్. ఎల్.యాజమాన్యం చర్చలు జరిపింది.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.. అయితే, ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు…
ఏపీలో ఇప్పటికే ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్ సర్కార్ సతమతమవుతుంటే ఏపీ వైద్యాఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్ పేల్చారు. జగన్ సర్కార్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది తెలిపింది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు దశల వారి ఉద్యమానికి ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ( హంస) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపీ…
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు ముట్టడించారు. ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి లేదా ఆన్లైన్ విధానం ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించాలంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులు. ఇందులో భాగంగానే సత్యసాయి నిగమాగమం నుండి మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి వరకు ర్యాలీగా బయలుదేరారు విద్యార్థులు. read also : సినిమాలో కోడి కథ లాగే కేసీఆర్…
ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జూనియర్ డాక్టర్లు (జూడా) సంఘం నేటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఫ్రంట్‌లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కొవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండు చేస్తున్నారు. కాగా ప్రభుత్వంతో జూడాలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి,…