విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్మా వద్దు.. జీతాలు పెంచండి అనే అంశంపై మీటింగ్ లో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. 28 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 18వేలు అంగన్వాడీలకు ఇస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో దాన్ని అమలు చెయ్యడం లేదని అన్నారు. కనీస వేతనాలు కార్మికులకు…
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంగన్వాడీలకు కలెక్టర్లు నోటీసులు ఇచ్చారు. గత 22 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అంగన్వాడీల ఆందోళనతో పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని వారు తెలిపారు. గతంలో అనేక సందర్భాల్లో అంగన్వాడీల కోరికలను ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. అంగన్వాడీల సమ్మెతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు వంటి వారికి పౌష్టికాహారం అందించేందుకు ఇబ్బందులు వస్తున్నాని చెప్పారు. ఈ క్రమంలో.. అంగన్వాడీలు జనవరి ఐదు లోపు విధులకు హాజరు కావాలని జిల్లా…
రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'హిట్ అండ్ రన్' వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది.…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. నేటి నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీలకు సంబంధించిన మూడు ప్రధాన సంఘాలు.. మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి.
జర్మనీలో రైలు డ్రైవర్ల సమ్మెకు దిగారు. లోకో ఫైలెట్స్ జీతాల పెంపు కోసం వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న జీడీఎల్ యూనియన్ గురువారం రాత్రి 24 గంటల సమ్మెను ప్రారంభించింది.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ టూరిజం కార్మికులు చేపట్టిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో టూరిజం కార్మికుల సంప్రదింపులు సఫలం కావడంతో వారు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత సమ్మె చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. పీఆర్‌సీపై ఉభయుల మధ్య ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సాంకేతిక రంగంలో ముందుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) అన్ని వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగంపై ప్రభావం చూపుతోందని వారు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ దీని ప్రభావం పడింది.
Ration Dealers: సమ్మె కొనసాగింపుపై రేషన్ డీలర్లు వెనక్కి తగ్గారు. దీంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఇంతకు ముందు రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె బాట పట్టింది. Read Also: R Krishnayya: బీసీల్లోని 6 కులాలకే రూ. లక్ష ఇస్తోంది: ఆర్ కృష్ణయ్య డీలర్లు చనిపోతే…