హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ వ్యూహం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ వ్యూహం ఏంటి? ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకుందా? గత ఉపఎన్నికలకు భిన్నంగా పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతున్నారా? ఆసక్తి రేకిత్తిస్తోన్న గులాబీ శిబిరం ఎత్తుగడలను ఈ స్టోరీలో చూద్దాం.
హుజురాబాద్‌పై పూర్తిస్థాయి పట్టుకోసం దృష్టి
Also Read
ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది. ఉపఎన్నికల్లో అంతకు మించిన వ్యూహాలు అధికార పార్టీ సొంతం. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌లోనూ అలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది గులాబీ పార్టీ. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే నాటికే.. హుజురాబాద్ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలనే లక్ష్యంతో పావులు కదుపుతోందట.
మండలస్థాయిలో ఇంఛార్జుల పని మొదలైంది!
ఇప్పటికే మండలాల వారీగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంఛార్జ్‌లను నియమించింది టీఆర్‌ఎస్. పార్టీ పిలుపు అందుకున్న నాయకులు.. తమకు అప్పగించిన ప్రాంతాలకు వెళ్లిపోయారు. అక్కడ కాలు పెడుతూనే ఎన్నికల ప్రణాళికల్లో మునిగిపోయారట. గ్రామస్థాయిలో ఉపఎన్నికకు టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నిత్యం వారితో మాట్లాడటం.. ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకు చేపట్టాల్సి పనులపై దిశానిర్దేశం చూస్తున్నట్టు సమాచారం.
ఉద్యమనాయకుల ద్వారానే ఈటలకు కౌంటర్
బీజేపీ నుంచి బరిలో దిగాలని చూస్తోన్న ఈటల రాజేందర్.. పదే పదే తాను ఉద్యమకారుడినని చెప్పుకొంటున్నారు. టీఆర్‌ఎస్‌లో తనను విమర్శించేవాళ్లంతా పార్టీలోకి మధ్యలో వచ్చినవాళ్లేనని తిప్పికొడుతున్నారు. ఈ విషయంలో ఈటలకు గట్టిగానే కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించిందట టీఆర్‌ఎస్. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారికితోడుగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన టీఆర్‌ఎస్ నేతలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అక్కడ మోహరింప చేయనున్నట్టు తెలుస్తోంది.
మరింత మంది ఉద్యమ నాయకులు సిద్ధం
ఈ వ్యూహంలో భాగంగానే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులను హుజురాబాద్ పంపబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినోద్‌కుమార్ ఆల్‌రెడీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఉపఎన్నిక ప్రచారం ఊపందుకున్న తర్వాత ఉద్యమ నాయకులు మరికొంత మంది వెళ్తారని.. ఇందుకోసం జాబితా కూడా సిద్ధమైందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లోని ఉద్యమ నాయకులు పెద్ద సంఖ్యలో హుజురాబాద్‌లో మోహరిస్తే ఈటల మాటలకు గట్టిగా కౌంటర్ ఇవ్వొచ్చని అనుకుంటోంది అధికారపార్టీ శిబిరం.
పదునెక్కుతున్న టీఆర్‌ఎస్ గెలుపు వ్యూహాలు
ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలను మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఇద్దరూ పర్యవేక్షిస్తున్నారు. గెలుపు వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. దీంతో గతంలో జరిగిన ఉపఎన్నికలకంటే హుజురాబాద్ ఉపపోరు రసవత్తరంగా సాగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!