శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ప్రభావితం చేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది. ఆన్‌లైన్ అంతరాయాలను పర్యవేక్షించే వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. భారతదేశంలోని వేలాది మంది వినియోగదారులు మధ్యాహ్నం 12:02 గంటలకు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.