రాష్ట్ర విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ పెట్టాయి. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి. చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ. 261 కోట్లు తెలంగాణ చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు.
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు ప్రక్రియను నిలిపివేశారు అధికారులు. బయటి రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు తరలించామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడతో తాళాలు పగలగొట్టి తెరిచినట్లు పేర్కొన్నారు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలన్నీ అల్మారాలు, లాకర్లలో పెట్టారు.
బాపట్ల జిల్లా మార్టూరులో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. సమాచారం తెలుసుకుని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. సెర్చింగ్ ఆర్డర్స్ లేకుండా, డిప్యూటేషన్ లేకుండా నెల్లూరు మైనింగ్ ఏడీ మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు.
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి తగిలాడు. ముందుగానే వాతావరణ సంస్థలు చెప్పిన విధంగా ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ ప్రారంభమైన గంటకే వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాప్రికా 14 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే వరుణుడు ఒక్కసారి అడ్డుతగలగా.. మరోసారి ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ ఆటను ఆపేశారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న(శుక్రవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాలో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు విద్యుత్ పోవడంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)పని చేయలేదు. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. నిన్నటిలానే పలుమార్లు ఇబ్బంది పెట్టిన వరుణుడు.. ఇవాళ కూడా నేనున్నానంటూ వచ్చేశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 47 ఓవర్లు పూర్తయ్యాక వర్షం పడుతుండటంతో ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అస్వస్థతకు గురై.. అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సహాయం చేయమని వైద్య బృందాన్ని కోరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెడుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం పొగలు వచ్చాయి. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తోన్న వందే భారత్ రైలులో పొగలు రావడంతో అధికారులు అరగంట పాటు నిలిపివేశారు.