కలకలం.. వెలుగులోకి వైట్ ఫంగస్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.. కేసులు వెలుగు చూడగానే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) బయట పడడం కలకలం రేపుతోంది.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి.. దీంతో అప్రమత్తమైన వైద్యులు.. ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇది.. మహిళలు, పిల్లల్లో చాలా ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బ్లాక్ ఫంగస్ కంటే ఇది చాలా తీవ్రమైనదే కాకుండా శరీరంలోని అనేక భాగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు వైద్యులు.
ఓవైపు కరోనా కొత్త వేరియంట్.. బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలు ఆందోళనకు గురిచేస్తుండగా.. వైట్ ఫంగస్ ఇప్పుడు సవాల్‌గా మారిపోయింది.. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు వైట్ ఫంగస్ ప్రధాన కారణంగా చెబుతున్నారు వైద్య నిపుణులు.. ఊపిరితిత్తులతో పాటు చర్మం, గోర్లు, నోరు లోపలి భాగం, కడుపు, ప్రేగులు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడుకు కూడా వైట్ ఫంగస్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న నలుగురు రోగులు వైట్ ఫంగస్ బారిన పడ్డారని.. వారిలో ముగ్గురికి కరోనా టెస్ట్ చేయగానెగెటివ్‌గా వచ్చిందని.. అయితే, యాంటీ ఫంగల్ మందులు ఇవ్వగా వారు కోలుకున్నట్టు తెలిపారు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని మైక్రోబయాలజీ విభాగం చీఫ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Tags
- Black Fungus
- brain
- kidney
- mouth
- nails
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!