దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో ఈ వారమంతా ఇలానే ట్రేడ్ అయింది.
దేశీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే మార్కెట్‌కు కొత్త ఆశలు చిగురిస్తాయని ఆర్థిక నిపుణులు అంతా భావించారు.
గత వారం ముగింపులో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఈ వారం ప్రారంభంలో కూడా అదే విధానం కొనసాగింది. ఇక కొత్త వైరస్ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసింది.