హైదరాబాద్ శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించిన రాందేవ్ బాబా.. చినజీయర్ స్వామిపై ప్రశంసలు కురిపించారు. రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్‌స్వామి చరిత్రలో నిలిచిపోతారని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. భారత వాస్తు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకునేవారు కచ్చితంగా రామానుజాచార్యుల దివ్యక్షేత్రాన్ని సందర్శించాలని సూచించారు. తాను వీలైనన్నిసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటానని రాందేవ్ బాబా చెప్పారు. అటు భారతీయ సంస్కృతిలో అసమానత, అన్యాయం ఉందని కొందరు పదేపదే వాదిస్తుంటారని.. సనాతన ధర్మంపై…
నమ్మకం, కులం, మతంతో సహా అన్ని అంశాలలో సమానత్వం అనే ఆలోచనను ప్రోత్సహించిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యుల స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన సమానత్వ విగ్రహాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక ఈరోజు ఉదయం నుంచి సమతా మూర్తి విగ్రహం సందర్శనకు జనాలు పోటెత్తారు. సందర్శకులకు ఫ్రీ ఎంట్రీ లభిస్తోంది. అయితే తాజాగా ఈ విగ్రహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సందర్శించబోతున్నట్టు సమాచారం. Read Also…
సమానత్వం కోరే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామనుజ విగ్రహ ఏర్పాటు అద్భుతం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల కిందట .. ఒక మహానుభావుడు.. సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది.. వాటికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసిన మహానుభావుడు రామానుజల వారని కొనియాడారు. రామనుజుల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన…