నమ్మకం, కులం, మతంతో సహా అన్ని అంశాలలో సమానత్వం అనే ఆలోచనను ప్రోత్సహించిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యుల స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన సమానత్వ విగ్రహాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక ఈరోజు ఉదయం నుంచి సమతా మూర్తి విగ్రహం సందర్శనకు జనాలు పోటెత్తారు. సందర్శకులకు ఫ్రీ ఎంట్రీ లభిస్తోంది. అయితే తాజాగా ఈ విగ్రహాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సందర్శించబోతున్నట్టు సమాచారం. Read Also…
ఇవాళ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్, ముచ్చింతల్‌ల్లో జరిగే కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే పాల్గొంటారని వివరించాయి.…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ పర్యటన కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక, ఇక్రిశాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్…
హైదరాబాద్ నగరం శివారులోని ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల నేపథ్యంలో తపాలా శాఖ ప్రత్యేకంగా పోస్టల్ కవర్‌ను రూపొందించింది. ఈ మేరకు తపాలా శాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను చినజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం సమతా మూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2,500 మంది కళాకారులు ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరిగింది.…
వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. ఇక, శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్…