హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.. ముచ్చింతల్‌కు వీఐపీల తాకిడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కీలక నేతలు, సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే కాగా.. ఇవాళ సమతామూర్తి కేంద్రానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాబోతున్నారు.. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు రాష్ట్రపతి.. బేగంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్…
ప్రపంచంలో ఇప్పటి వరకు ఏడు అద్భుతాలు ఉన్నాయి.. ఇప్పుడు రామానుజ సమతా మూర్తి విగ్రహం ఎనిమిదో అద్భుతం అని అభివర్ణించారు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ఇవాళ ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చిన ఆయన.. శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల వారి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని వెల్లడించారు. సమతామూర్తి కేంద్రం ప్రపంచంలో 8వ వింతగా పేర్కొన్నారు.. సమాత మూర్తి విగ్రహం ఏర్పాటు చేసినందుకు భారత…
ఇటీవల హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి విగ్రహాన్ని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం సమానత్వానికి ప్రతీకగా నిర్మించిన భారీ విగ్రహం సమతామూర్తి సన్నిధికి చేరి అక్కడి విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని దర్శించగా, తాజాగా అల్లు అర్జున్ సమతామూర్తి సన్నిధిని చేరుకున్నారు. అల్లు అర్జున్ కు స్వయంగా చిన్న జీయర్ స్వామి ఆ ప్రాంతాన్ని అంతా తిప్పి చూపిస్తూ,…
హైదరాబాద్ శంషాబాద్ శివారులో సమతా విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే సమతా విగ్రహం తయారీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటోందని… సమతా విగ్రహాన్ని చైనాలో తయారుచేశారని.. ఆత్మనిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడటమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలతో…
ఈ దేశంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలు ఎక్కువ శాతం నడుపుతోంది హిందువులే… హిందువుల ముందు నిలబడే సామర్థ్యం ఎవరికి లేదని వ్యాఖ్యానించారు ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్… హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్య మిలీనియం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం సనాత ధర్మంలో అన్ని ఉన్నాయి. దేశంలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మనం ఎవరో మనం మరిచిపోయాం అంతే.. ఇప్పుడు ప్రతి హిందువు ఇదే మరిచిపోయాడు. తనలోని బలం ఏంటో తనకు తెలియదు.…
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని దుయ్యబట్టారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సమతామూర్తి కార్యక్రమాల్లో…