Supreme Court: అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. స్టేట్ గవర్నమెంట్స్ వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారింది.. ప్రైవేట్ హస్పటల్స్ అన్నీ రోగులు, వారి బంధువుల నుంచి బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా సుప్రీంలో విచారణ జరిపింది.
పోలీసు స్టేషన్‌లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను నెల రోజుల్లోగా పాటించాలని సూచించింది.