వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, రాజశేఖర్ రెడ్డి తోనే రాష్ట్ర విభజనకు అనుకూలం అనే తీర్మానాన్ని 2009లోనే కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీలో పెట్టించాలని చూసిందని పేర్కొన్నారు.. 2014లో జరిగిన రాష్ట్ర విభజన 2009లోనే జరిగాల్సింది ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన పై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ కామెంట్లపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ నేతలు. మోడీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. బీజేపీ పలాయన వాదానికి,పసలేని వాదనకు ఇది నిదర్శనం అన్నారు. ప్రధాని మోడీ వైఖరి అత్త చచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చినట్లుందన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలయింది. ఇప్పుడు ఏవిధంగా జరిగింది…