మన తెలుగు సినిమాలు రికార్డులు బద్దలు కొడుతూ సాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో పలు నంబర్లు హల్ చల్ చేస్తూ ఉంటాయి. దక్షిణాదిన టాలీవుడ్ నంబర్ వన్ సినిమా రంగం అంటూ ప్రచారాలూ చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ, మన టాప్ స్టార్స్ సినిమాలకు వస్తున్న వసూళ్ళ వివరాలు అధికారమో అనధికారమో తెలియడం లేదు. పైగా ఎవరికి వారు అంతా ఇంతా అంటూ టముకు వేస్తున్నారు. ఇక టీజర్స్, ట్రైలర్స్ విడుదలయినప్పుడయితే, గంటల లెక్కన వ్యూస్, లైక్స్…