జార్ఖండ్‌లోని దుమ్కాలో స్పానిష్ మహిళా టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం ఉదంతం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 21 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందినదిగా గుర్తించారు. పాలములోని విశ్రంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అయితే.. ఆమే స్టేజ్ ప్రదర్శన ఇవ్వడం కోసమని జార్ఖండ్‌కు వెళ్లింది. కాగా.. బాధితురాలి సహోద్యోగులే అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఈ ఘటన సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.…