“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లకు గ్రాండ్ లెవెల్లో సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. ఈరోజు సోల్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ ‘జనని’కి సంబంధించి విలేఖరుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు రాజమౌళి అండ్ టీం. ఈ సమావేశంలో విలేఖరులను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని రాజమౌళి రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఒకటొకటిగా ప్రశ్నలు అడగడం, వాటికి సమాధానాలు చెప్పుకుంటూ పోతే మ్యాటర్ ఎక్కడికో వెళ్తుందని, ఇది కేవలం ఈ సాంగ్ గురించేనని, ప్రమోషనల్ కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్స్ అయితే…
టాప్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్, అప్డేట్స్ రూమర్స్ సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక ఈ పాన్ ఇండియా సినిమాను విడుదల చేయడానికి రాజమౌళి వేస్తున్న ప్లాన్స్ అదిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.…
యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ అవ్వడం, వాటిపై కామెంట్లు పెట్టి తమ అభిమాన హీరోలను మెచ్చుకోవడం లేదా విమర్శించడం వంటివి జరగడం సాధారణమే. కానీ ఒక వీడియోపై యూట్యూబ్ స్వయంగా కామెంట్ చేయడం మాత్రం విశేషం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించింది యూట్యూబ్. ఈసారి యూట్యూబ్ ఇండియా ట్విట్టర్ వంటి ఇతర సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ప్రమోట్…
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. ఈ చిత్రంపై అభిమానులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న స్టోరీ ఏం చూపిస్తాడు..? అల్లూరి సీతారామరాజు, కొమరం…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి…
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన ప్రేక్షక్షుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ పేరిట విడుదల చేసిన వీడియో నందమూరి, మెగా అభిమానుల్లో జోష్ పెంచింది. ఈ వీడియోతో అంచనాలు భారీగా పెరిగాయి.…
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7న సంక్రాంతి వేడుకలకు మరింత ఉత్సహాంగా జరుపుకునేందుకు చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రోజు దీపావళి కానుకగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఆర్ఆర్ఆర్ గ్లింప్స్’ అంటూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాను ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా.. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో టీజర్ గ్లింప్స్ విడుదల ఆపేశారు. టీజర్ గ్లింప్స్ రిలీజ్ పై త్వరలోనే విడుదల చేస్తామని చెప్పిన చిత్రయూనిట్ రేపు 11…
(అక్టోబర్ 10న ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు) ఆ నాడు దేశంలో అరాచకం అలుముకున్న వేళ ఛత్రపతి వీరోచిత పోరాటం చేసి, మళ్ళీ మన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించారు. అదే తీరున తెలుగు సినిమా ప్రాభవం తరిగిపోతున్న వేళ మరోమారు ప్రపంచ యవనికపై తెలుగు చిత్రాల వెలుగును ప్రసరింప చేసిన ఘనుడు దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లో తెరకెక్కిన ‘స్వర్గసీమ’, ‘మల్లీశ్వరి’, ‘పాతాళభైరవి’ వంటి చిత్రాలు ఎల్లలు దాటి ప్రదర్శితమై, తెలుగు చిత్రాల ఉనికిని చాటాయి.…