ఎయిరిండియా పైలట్ సృష్టి తులి మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రియుడు ఆదిత్య పండిట్ దారుణాతీదారుణంగా టార్చర్ పెట్టిన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
వారిద్దరూ పైలట్లు.. ట్రైనింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అలా రెండేళ్ల నుంచి ఇద్దరి మధ్య బంధం కొనసాగుతోంది. ఆమెకు నాన్-వెజ్ అంటే ఇష్టం.. అతడికేమో వెజ్ అంటే ఇష్టం. కానీ అదే వారిని బద్ద శత్రువులుగా చేసింది. చివరికి ఒకరి ప్రాణం తీసింది.