కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. శ్రీశైలం ఆలయంలో షా పూజలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి., అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.25కు కర్నూలు శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. అనంతరం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అక్కడి…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం వెళ్లనున్నారు.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌షా… ఆ తర్వాత బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అక్కడే లంచ్ చేసి.. తిరిగి హెలికాప్టర్‌లో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అనంతరం తిరిగి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.. మొత్తంగా..…
శ్రీశైలం డ్యామ్‌కు క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది… ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కుల దిగవకు పడిపోయింది.. అయినా.. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… ఇన్ ఫ్లో 2,83,141 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 3,65,487 క్యూసెక్కులుగా ఉంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.60 అడుగులుగా ఉంది… పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు…
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది.. 4,66,864 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా… కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఔట్ ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉంది.. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 879.30 అడుగులకు చేరింది… పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, ఇంకా భారీగానే…
కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది.. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు అయితే, ప్రస్తుత నీటిమట్టం 1631.45 అడుగులకు చేరింది. ఇక, పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 95 టీఎంసీలు ఉన్నాయి.. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 1.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 33 గేట్లు ఎత్తి 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. దీంతో.. దిగువప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు మొదటి…
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఆ తర్వాత ఫిర్యాదులు, లేఖలు ఇలా ముందుకు సాగింది.. ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు.. ఇప్పటికే కేఆర్‌ఎంబీకి.. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి లేఖలు వెళ్లగా.. తెలంగాణ చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు ఇప్పుడు కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటి విడుదల…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించాయి.. ఇప్పటికే పలు దపాలుగా ఆయల పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతుండగా.. మళ్లీ ఎగిరాయి డ్రోన్లు.. ఇక, డ్రోన్లను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.. అయితే, శ్రీశైలంలో గత నాలుగు రోజులుగా అర్ధరాత్రి సమయంలో డ్రోన్లు సంచరిస్తున్నాయి.. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్నాయి.. వీటిని పట్టుకోవడానికి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి డ్రోన్లు కలకలం సృష్టించాయి… శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొట్టినట్టు చెబుతున్నారు.. డ్రోన్ల కదలికలను గుర్తించిన పోలీసులు, ఆలయ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి చిక్కలేదు.. అయితే, నాలుగు రోజులుగా రాత్రిపూట ఆలయ పరిసరాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు… అర్ధరాత్రి పూట డ్రోన్లు తిరగడంతో శ్రీశైలంలో ఏమి జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, భక్తులు..…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు…