కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి.. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి.. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు.. మరోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు.
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.
శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉధృతి పేరుగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 4,82,401 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 10 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తంగా 5,28,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు..
శ్రీశైలం జలాశయం 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.. ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పర్యాటకులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తారు అధికారులు.. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రూపంలో ఇంకా భారీగా వరద వస్తుండడంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు గరిష్టస్థాయికి చేరుకోవడంతో.. 7వ గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు.. ఈ కార్యక్రమంలో ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు… దీంతో.. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోలాహలం మొదలైంది..…