Srisailam Dam: పర్యటకులకు అలర్ట్.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత..
- శ్రీశైలం డ్యామ్ కు భారీగా నీటి వరద..
- గంట గంటకు పెరుగుతోన్న ఇన్ ఫ్లో..
- 880 అడుగులకు చేరువగా నీటిమట్టం..
- ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అవుతోన్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam: కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది నీటి ప్రవాహం పెరగడంతో.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు..? నాగార్జున సాగర్ నుంచి నీళ్లు ఎప్పుడు కిందికి విడుదల చేస్తారు? అని పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సమయం రానేవచ్చింది.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సాయంత్రం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.. ఇప్పటికే జలాశయానికి గంటగంటకు పెరుగుతోంది వరదప్రవాహం.. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర రివర్ నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి శ్రీశైలంలో చేరుతోంది..
Read Also: Stock Market Record : స్టాక్‌మార్కెట్‌లో తుపాను.. కొత్త శిఖరాగ్రానికి సెన్సెక్స్, నిఫ్టీ ఫ్యూచర్స్
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
దీంతో.. సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని వదలనున్నారు అధికారులు.. మొదట నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.. అయితే, ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.37 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.. మరోవైపు.. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో.. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62,725 క్యూసెక్కుల నీటిని వాడుతూ.. దిగువకు విడుదల చేస్తున్నారు.. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 877.80 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 171.8625 టీఎంసీలకు పైగా ఉంది.. సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 880 అడుగులకు చేరువగా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!