Ghost: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. గత కొన్నేళ్లుగా అయన సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణను అందుకుంటున్నాయి. గతేడాది వేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివన్న.. ఈ ఏడాది ఘోస్ట్ గా రానున్నాడు.
చిత్ర పరిశ్రమలో టైటిల్ వివాదం అనేది అప్పుడప్పుడు ఎదురయ్యే సంఘటన. తాజాగా టైటిల్ విషయంలో వివాదం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ద ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గ్లింప్స్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. ద కిల్లింగ్ మిషన్ పేరుతో ఈ గ్లింప్స్ విడుదల చేశారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్ స్టార్ ఎంటర్…
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొత్త చిత్రానికి ‘ఘోస్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జులై 12 బుధవారం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ‘బీర్బల్’ దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా…