వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆరోగ్యం విషమంగా ఉందని.. వైద్య చికిత్స అవసరమని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఆయన అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా వుందని తెలుస్తోంది.పలు నేరారోపణ, అత్యాచారం కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానందస్వామి నిత్యం వార్తల్లో వున్నారు. తాను జీవ సమాధి పొందుతానని ఈ ఏడాది మే నెలలో ప్రకటించారు.
కైలాస దేశం అని ఒకటి సృష్టించానని, అక్కడికి ఎవరైనా రావచ్చని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తనపై వున్న కేసుల నుంచి, అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయాడు నిత్యానంద. 2010లో ఓ అత్యాచార కేసులో అరెస్టై విడుదలైన తర్వాత శ్రీ కైలాసం అనే దీవిని కొనుగోలు చేసి.. దానికి కైలాస దేశమని పేరుపెట్టుకుని అక్కడే ఉంటున్నారు. అంతేకాదు కైలాస ద్వీప కరెన్సీ గా కొత్త కరెన్సీని ముద్రించి సంచలనం రేపాడు. ఈ కైలాస ద్వీపానికి తనని తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు తాను అనారోగ్యానికి గురయ్యానని, దీవిలో సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా తనకు అత్యవసరంగా చికిత్స చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. శ్రీలంకకు లేఖ రాయడం సంచలనంగా మారింది.