గోదావరి.. కొనసీమ ప్రాంతం కేవలం పచ్చని పొలాలు, నదీ ప్రవాహాలకే కాదు, పలు సంప్రదాయాలకు, విశ్వాసాలకు, అతిధి మర్యాదలకు ప్రతిబింబం. గోదావరి ప్రాంతాల వారి మర్యాదలకు ఎవరైనా శెభాష్ అనాల్సిందే. అలాగే ఆ ప్రాంతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ప్రబల తీర్థం ఒకటి. భక్తి, త్యాగం, సమూహ భావం మేళవించిన ఈ పండుగ చుట్టూ మానవ సంబంధాలు, అంతర్మథనాలు, భావోద్వేగాలు కలగలిపిన ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. సంక్రాంతి పండుగ…