గత నెల 25న జరిగిన హత్యకేసును శ్రీకాకుళం పోలీసులు చేధించారు. శ్రీకాకుళం టౌన్ సమీపంలోని విజయాదిత్య పార్క్ లో హత్యకు గురయ్యాడు మాజీ ఆర్మీ ఉద్యోగి చౌదరి మల్లేశ్వరరావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. మల్లేశ్వరరావును హతమార్చాడు సొంత బావమరిది సీపాన అప్పలనాయుడు. విజయాదిత్య పార్క్ కు పిలిపించి మరో ఐదుగురితో కలిసి హత్య చేసాడు అప్పలనాయుడు. ఈ హత్యకు ఆరులక్షల ఒప్పందం చేసాడు. ముందుగా 4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు.…