సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఇస్రో చైర్మన్ సోమనాధ్ కుటుంబ సమేతంగా దర్శించి పూజలు చేశారు, ఈ రోజు షార్ నుండి జరిగే PSLV – C53 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మణ్ణిని వేడుకున్నారు, ముందుగా ఆలయంలో ప్రదక్షణ చేసి పరివార దేవతలను దర్శించుకొని అనంతరం చెంగాళమ్మ ను దర్శించి పూజలు చేశారు, ఈ సందర్భంగా అమ్మణ్ణి ఎదుట ఇస్రో చైర్మన్ కు ఆయన తో పాటు వచ్చిన మరికొంత మంది ఇస్రో శాస్త్రవేత్తలకు ఆలయం EO ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి , పాలకమండలి సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి,ఓలేటి బాల సత్యనారాయణ,మన్నెముద్దు పద్మజ చేతులు మీదుగా ఆలయ
మర్యాదలు అందజేశారు.
ఇస్రో చైర్మన్ సోమనాధ్ మాట్లాడుతూ అమ్మణ్ణి ఆశీస్సులతో ప్రయోగం విజయవంతం కావాలని వేడుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల 02 నిమిషాలకు PSLV -C53 రాకెట్ ప్రయోగం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ ప్రయోగం ఎంతో కీలకమైనదని అన్నారు. ఇది పూర్తిగా సింగపూర్ దేశం కోసం చేసున్న ప్రయోగమని, అలాగే భారత్ లోని కొన్ని ప్రైవేటు సంస్థలకు సంబంధించి పరిశోధనలు నిమిత్తం కొన్ని సైంటిఫిక్ పేలోడ్స్ ను కూడా రాకెట్ లోని 4 వ స్టేజి లో పెట్టి పంపుతున్నట్లు ఆయన తెలియజేసారు. రాకెట్ ప్రయోగం కోసం శ్రమించిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. PSLV C-53 మిషన్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం సాయంత్రం 5 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఇది నిరంతరాయంగా 25 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం..మరి కాసేపట్లో నింగిలోకి దూసుకువెళ్ళనుంది.
TS TET 2022: రేపే టెట్ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే..?