అతిలోక సుందరి శ్రీదేవి మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లి మరో సంవత్సరం పూర్తి అయ్యింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం లక్షలాది మంది అభిమానుల హృదయాలను కలచి వేసింది. శ్రీదేవి కన్నుమూసి నాలుగేళ్లు అవుతున్న తరుణంలో దివంగత నటికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా ఆమె మరణ వార్షికోత్సవం సందర్భంగా తన తల్లిని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.…