తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.
Sri Rama Navami Celebrations:తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. ప్రతీ వాడ, ప్రతీ గ్రామం, ప్రతీ గుడిలో అనే విధంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.…