భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 240 పరుగులు చేసింది. భారత్ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (40), కామింధు మెండీస్ (40), దునిత్ వెల్లలాగే (39), కుశాల్ మెండీస్ (30) పర్వాలేదనిపించారు.
Wanindu Hasaranga Out From IND vs SL ODI Series: నేడు కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా గాయంతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం కారణంగా హసరంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. హసరంగా దూరమవడం లంకకే భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. అతడి స్థానంలో 34 ఏళ్ల లెగ్…
రోహిత్ భారత క్రికెట్ అభిమానులందరికీ ప్రత్యేకమైన, భావోద్వేగ సందేశాన్ని ఇచ్చాడు. బీసీసీఐ (BCCI) షేర్ చేసిన వీడియో కొన్ని వారాల క్రితం అభిమానులు.. ఆటగాళ్లు పంచుకున్న అన్ని చిరస్మరణీయ క్షణాలను సంగ్రహించింది. బార్బడోస్‌లో రోహిత్ కెప్టెన్సీ షూట్ నుండి మెరైన్ డ్రైవ్ దగ్గర విజయ పరేడ్.. వాంఖడే స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన సన్మాన కార్యక్రమం వరకు ఈ వీడియోలో చూపిస్తుంది.
ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్ తొలి వన్డే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.
IND vs SL 3rd T20: నేడు టీమిండియా శ్రీలంకతో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న శ్రీలంక బౌలర్లు టీమిండియా బ్యాటర్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48 పరుగులకే కీలక ఐదు వికెట్లను చేజారి పీకలోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ గా వచ్చిన జైశ్వల్ కేవలం పది పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్ డౌన్ గా వచ్చిన సంజు సాంసంగ్ మరోసారి సారీ…
India Trash Sri Lanka in 2nd T20I: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో సొంతం చేసుకుంది. ఆదివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్ష ప్రభావిత ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యం 8 ఓవర్లలో 78 పరుగులు కాగా.. 6.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 81 రన్స్ చేసింది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్…
ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో భారత్ పై శ్రీలంక విజయం సాధించింది. దీంతో.. ఆసియా కప్ 2024 విజేతగా శ్రీలంక మహిళల జట్టు అవతరించింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది శ్రీలంక ఉమెన్స్.
ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది టీమిండియా. భారత్ బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (60) హాఫ్ సెంచరీతో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. మంధాన ఇన్నింగ్స్ లో 47 బంతుల్లో 60 రన్స్ చేయగా.. అందులో 10 ఫోర్లు ఉన్నాయి. దీంతో.. శ్రీలంక ముందు 166 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కాసేపట్లో భారత్-శ్రీలంక మధ్య ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్‌లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ పై శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.