పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువైన ఆలయాల్లో ‘శ్రీ దుర్గా భోగేశ్వరా స్వామి’ దేవాలయం ఒకటి. ఈ ఆలయం నంద్యాల పట్టణంలోని గడివేముల మండలం గడిగిరాయి గ్రామ శివారులోని దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. దుర్గాభోగేశ్వరా లింగంగా పూజింపబడే ఈ శివలింగంపై ఏడాదికి ఒక్కసారి కార్తీకమాసంలో సూర్యకిరణాలు లింగంపై పడతాయి. శ్రీ దుర్గ భోగేశ్వరా స్వామి దేవాలయంలో సూర్యకిరణాలు నేడు శివలింగాన్ని తాకాయి. కార్తీక మాసం చివరి…