మ్యాచోస్టార్ గోపీచంద్ 30వ చిత్రం 'రామబాణం' ఈ నెల 5న విడుదల కాబోతోంది. అలానే నాని 30వ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న, ఎన్టీయార్ 30వ సినిమా సమ్మర్ స్పెషల్ గా వచ్చే యేడాది ఏప్రిల్ 5న జనం ముందుకు రాబోతున్నాయి.
జగపతిబాబు కీలక పాత్ర పోషించిన 'రామబాణం' చిత్రం శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' తర్వాత తనకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయని జగ్గూభాయ్ చెబుతున్నారు.
Gopichand: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి శోభన్ బాబు టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా పతాకంపై కూచిబొట్ల వివేక్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్' లో రివీల్ చేస్తున్నారు.