ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం 'కిడ'. విశేషం ఏమంటే గోవా జరుగుతున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఇది ఎంపికైంది. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు స్టాండింగ్ ఒవోషన్ ఇచ్చారు.
Kida: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో సుప్రసిద్ధ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా ‘కిడ’ ఒకటి. పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ…