భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ బీసీసీఐ నుంచి సెలవును అభ్యర్థించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది
ఎంతటి వారున్నా శిక్షిస్తాం: గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నాం అని, భూకబ్జాలకు పాల్పడిన వారికి 10-14 ఏళ్లు శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13 వేల ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్దారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ…
నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు: నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ప్రశ్నోత్తరాలలో కడప నగరంలో తాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు, విద్యా శాఖలో ఖాళీలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు, డిస్కంలచే కొనుగోళ్లలో అక్రమాలు, భీమిలీ నియోజకవర్గంలో ప్రభుత్వ…
నేడు నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. కడపలో త్రాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన గ్రామాలలో కనీస సదుపాయాలు, విద్యాశాఖలో ఖాళీలు.. అంశాలపై చర్చలు జరగనున్నాయి. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు మధ్యాహ్న ఒంటి గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. ఉదయం…