భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 కోసం అంపైర్ల జాబితాను ప్రకటించింది. ఈసారి ఐపీఎల్లో ఏడుగురు కొత్త భారతీయ అంపైర్లు తొలిసారి అధికారికంగా అంపైరింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు.. సీనియర్ అంపైర్లు కుమార్ ధర్మసేన, అనిల్ చౌదరి ఈ సీజన్లో కనిపించరు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు బౌలర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. ఈ సీజన్లో బౌలర్లు బంతిపై ఉమ్మి (లాలాజలం) వాడకంపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది.