ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
ఇవాళ ఉదయం 11.30కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఆర్టీజీఎస్, ప్రభుత్వ పథకాలు ప్రజల అభిప్రాయంపై సమీక్ష.. ఆపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ ఆధార్టీ సమావేశం
హిందూపురం పట్టణంలోనీ భవాని శంకరమఠంలో వెలసిన శారదాదేవి అమ్మవారిని ప్రతిష్టించి 50 వసంతాలు పూర్తి.. ఈ సందర్భంగా నేడు అమ్మవారికి మహాపుష్పయాగం
ప్రమాదవశాత్తు మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు నేడు చెక్కుల పంపిణీ.. చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్సీ నాగబాబు.. ప్రమాదవశాత్తు మరణించిన 101 కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు.. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ. 5.05 కోట్ల బీమా.. మంగళగిరిలోని ఆర్ఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో కార్యక్రమం
తిరువూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి నేడు ఎన్నిక.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన చైర్ పర్సన్ ఎన్నిక.. వైసీపీ నుంచి టీడీపీకి దక్కనున్న చైర్ పర్సన్ పీఠం
విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నేడు ప్రారంభం.. హాజరుకానున్న హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
నేడు పెదనందిపాడు తహశీల్దారు కార్యాలయం వద్ద నల్లబర్లీ పొగాకు కొనుగోలు చెయ్యాలంటూ రైతు సంఘాల ధర్నా
నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్న సీఎం.. పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేటి నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30 (ఏ) పోలీస్ యాక్టుల అమలు.. సభలు, సమావేశాలు, ధర్నాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి.. అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తే చర్యలు
నేడు ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరులో 26 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరి వద్ద ఈరోజు మినీ శిల్పారామంను ప్రారంభించనున్ను మంత్రి జూపల్లి కృష్ణారావు