IND Vs SA: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి రనౌట్‌గా వెనుతిరగ్గా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 49 పరుగులకు అవుటయ్యాడు. గత…
IND Vs SA: ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 27.1 ఓవర్లలో 99 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టీమిండియా ముందు 100 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే మూడు వన్డేల సిరీస్ భారత జట్టు సొంతం అవుతుంది. 34 పరుగులు చేసిన క్లాసెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానేమన్ మలాన్…
IND Vs SA: ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య కీలక మూడో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా, రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో ఈ వన్డేలో ఎవరు గెలిస్తే మూడు వన్డేల సిరీస్ వారికే సొంతం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో వన్డేలో ఆడుతున్న టీమ్‌నే మూడో వన్డేలోనూ…
Ishan Kishan: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఇషాన్ బ్యాటింగ్ అభిమానులను అలరించింది. ఈ క్రమంలో అతడు తన పేరిట కొత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు. ఒక వన్డేలో 7 సిక్సులు కొట్టిన రెండో భారత యంగెస్ట్ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. గతంలో రిషబ్ పంత్ పేరిట ఈ రికార్డు ఉండేది. పంత్ 23 ఏళ్ల 173…
IND Vs SA: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్, జిడ్డు బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనబెట్టింది. వీరి స్థానంలో ఆల్‌రౌండర్లు షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే తొలివన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ వన్డే…
Asia Cup 2022: పురుషులు విఫలమైన చోట మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా శనివారం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ షెఫాలి వర్మ రాణించింది. ఆమె 44 బంతుల్లో 5 ఫోర్లు, 2…
BCCI: ఈనెల 18తో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత కార్యదర్శి, కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు అని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో కర్ణాటక…
Asia Cup 2022: ఆసియా కప్ విషయంలో పురుషుల బాటలోనే టీమిండియా మహిళలు పయనించారు. ఇటీవల జరిగిన సూపర్-4లో విభాగంలో పాకిస్థాన్‌పై ఓటమి చెంది టోర్నీ నుంచి టీమిండియా తప్పుకుంది. తాజాగా మహిళల ఆసియా కప్‌లోనూ టీమిండియాకు చేదు ఫలితం ఎదురైంది. టీమిండియాపై పాకిస్థాన్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పవర్ ప్లేలో మూడు…
Common Wealth Games 2026: 2026లో కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగనున్నాయి. ఈ మేరకు 2026లో జరిగే ఎడిషన్‌లో ఉండబోయే స్పోర్ట్స్ లిస్ట్‌ను కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ జాబితాలో 2022లో లేని షూటింగ్‌ను నిర్వాహకులు చేర్చారు. అయితే రెజ్లింగ్‌ను మాత్రం తొలగించారు. 2026లో మొత్తం 20 క్రీడలు, 26 క్రీడాంశాలు ఉండనున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లోనే భారత్‌కు అత్యధిక పతకాలు వచ్చాయి. వీటిలో ఆరు బంగారు,…
Team India: ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022లో జరిగిన అన్ని ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్ విజయాలు సాధించింది. అటు స్వదేశంలో, ఇటు విదేశాల్లో జరిగిన అన్ని టీ20 సిరీస్‌లను ఓటమి అనేది లేకుండా ముగించింది. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు సొంతం చేసుకుని ఐసీసీ ర్యాంకుల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఓటమి అనేది లేకుండా సాగుతున్న టీమిండియా ఆసియా కప్‌లో…