ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందే ఎస్పీజీ రంగంలోకి దిగింది.. అమరావతి చేరుకున్న ప్రధాని మోడీ భద్రతా దళం.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించి.. మోడీ టూర్ సాగే రూట్లలో ప్రయాణిస్తూ.. ప్రత్యేకంగా పరిశీలించింది SPG.. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.. భద్రతా ఏర్పాట్లను SPGకి వివరించారు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ లు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఎస్పీజీ అధికారులతో…
పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌కు రైలులో వెళ్లనున్నారు. అది యుద్ధ ప్రాంతం కావడంతో ప్రధాని మోడీ ఈ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారత ప్రధాని దేశం నుంచి వెళ్లినప్పుడల్లా ఆయన భద్రతకు ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా? విదేశీ పర్యటనలో ప్రధాని మోడీకి భద్రత యొక్క ప్రోటోకాల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… భారత ప్రధాని భద్రత బాధ్యత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)పై ఉంది.…
Arun Kumar Sinha: స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా మరణించారు. హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాసవిడిచారు. 2016 నుంచి ఆయన ఎస్పీజీ గ్రూప్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, మాజీ ప్రధానుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. హరిత ప్లాజా ఎంట్రీ పాయింట్ వద్ద అమిత్ షా కాన్వాయ్‌కి ఓ కారు అడ్డొచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో అమిత్ షా భద్రతా సిబ్బంది కారు వెనక అద్దం పగలగొట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు.. 4 అంచల భద్రత ఏర్పాటు చేశారు.. వీఐపీ సెక్యూరిటీ, అప్పర్, లోయర్, మిడిల్ ఇలా ప్రధాని మోడీ చుట్టూ ఎస్పీజీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి..