టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్..ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత సందీప్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సందీప్ ఈ సినిమాను వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్…
స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ చాలా కాలం తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు.. ఈయన హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది.…
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అస్వస్థతకు గురై.. అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సహాయం చేయమని వైద్య బృందాన్ని కోరారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. భారతదేశం "విశ్వగురువు"గా మారాలంటే ప్రజలు సామరస్యంగా జీవించాలని.. మంచి విద్య, వైద్య సదుపాయాలు మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు.
పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు.