ఉగాది పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం ఐదు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, మచిలీపట్నం-తిరుపతి, కాకినాడ-తిరుపతి, కాకినాడ-వికారాబాద్, తిరుపతి-మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రత్యేక రైళ్ల వివరాలు: ★ సికింద్రాబాద్-తిరుపతి (రైలు నం: 07597) రైలు ఏప్రిల్ 1న రాత్రి 8:15 గంటలకు బయలుదేరుతుంది ★ మచిలీపట్నం-తిరుపతి (రైలు నం: 07095)…
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 10 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 7, 22 తేదీల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 7, 14వ తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం, 8, 16 తేదీల్లో విశాఖపట్నం-కాచిగూడ, 11న కాచిగూడ – నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21 తేదీల్లో కాకినాడ టౌన్- లింగంపల్లి, 20, 22 తేదీల్లో లింగంపల్లి – కాకినాడ టౌన్…
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 1 నుంచి 31 వరకు ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మచిలీపట్నం-కర్నూలు, నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ, మచిలీపట్నం-సికింద్రాబాద్, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు:
అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి పెరగడంతో దక్షణిమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ స్టేషన్‌ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలుస్తోంది. జనవరి…
అయ్యప్ప స్వాముల మాలధారణల నేపథ్యంలో శబరిమల వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కొల్లం వరకు ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 19-22 తేదీల మధ్య కాచిగూడ-కొల్లం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని.. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఈనెల 17న సికింద్రాబాద్-కొల్లం మధ్య, 19న కొల్లం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నామన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో కాచిగూడ నుంచి 07053, 07141…
సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రత్యేకరైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 17, 24 తేదీల్లో స్పెషల్ రైళ్లు తిరగనున్నాయి. ఆయా తేదీల్లో రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే విశాఖలో ఈ నెల 16, 23 తేదీల్లో సాయంత్రం 5:35 గంటలకు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7:10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. స్పెషల్ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి,…