కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను పులి వణికిస్తుంది. సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న లేగ దూడను చంపి ఎద్దుపై దాడి చేసింది.. పులి దాడిలో ఎద్దుకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో.. కెనాల్ ఏరియాలో పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి మానిటరింగ్ కోసం 10 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.. పిఠాపురంలో సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 21 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు..
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సూచించిన సూచనల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
తిరుమలలో సంచలనం కలిగించిన బాలుడి కిడ్నాప్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కిడ్నాప్ కి గురైన బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ పుటేజి ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న ఉదయం రైల్వే స్టేషన్ కి బాలుడితో సహ కిడ్నాపర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి. కిడ్నాపర్ తెలుగు భాష మాట్లాడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తిరుపతి నుంచి ట్రైన్ ద్వారా నెల్లూరు లేదా కడపకు…
అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని…
భారత్‌లో దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు…ఊహించని విధంగా పెరిగిపోతున్నాయ్. ఒమిక్రాన్ పాజిటివ్‌లు…450కి చేరువయ్యాయ్. రిస్క్ దేశాల నుంచే కాకుండా…నాన్ రిస్స్‌దేశాల నుంచి వచ్చిన వారిలోనూ ఒమిక్రాన్ బయటపడుతోంది. మరోవైపు పదిరాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్ పాకగా.. 450కి చేరువయ్యాయ్. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43 కేసులు నమోదయ్యాయి.…