Vostro Accounts ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో ఒకటి.. వోస్ట్రో అకౌంట్లు. వీటినే.. స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్లు.. SRVA.. అని కూడా అంటారు. ఇతర దేశాలతో చేసే ఎగుమతులు, దిగుమతులకు పేమెంట్లను రూపాయల్లో నిర్వహించటానికి ఇండియా ఈ సరికొత్త ప్రక్రియకు ఇటీవల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భారతదేశం ప్రారంభించిన ఈ నూతన విధానం పట్ల పలు దేశాలు కూడా ఉత్సాహం కనబరుస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తోంది.