Liverpool Football Club: ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్లలో ఒకరైన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధిపతి ముఖేష్ అంబానీ ఇప్పటికే మన దేశంలోని క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్‌లోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును పదేళ్లకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఫుట్‌బాల్ టోర్నమెంట్ ‘ఇండియన్ సూపర్ లీగ్’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇప్పుడు విదేశాల్లోని క్రీడా రంగంలో సైతం పెట్టుబడులు పెట్టనున్నారా అనే వార్తలు వెలువడుతున్నాయి.
‘‘Bisleri’’ Ramesh Chauhan: ఈ రోజుల్లో మనం ఎక్కడికి వెళ్లినా పక్కన ఒక వాటర్ బాటిల్ ఉంచుకుంటున్నాం. మనం వెళ్లే చోట మంచి నీళ్లు ఉంటాయని తెలిసినప్పటికీ వాటర్ బాటిల్స్‌ను మర్చిపోకుండా పట్టుకెళుతున్నాం. ఇది ఇప్పుడు అందరికీ ఒక అలవాటుగా మారింది. అంటే.. మంచి నీళ్ల సీసాలకు మంచి ప్రజాదరణ వచ్చింది. అయితే.. మన దేశంలో ఇలా వాటర్ బాటిల్స్‌కి ఇంత పాపులారిటీ రావటం వెనక ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే.. రమేష్ చౌహాన్. ఈ వారం…
Indian States Going Bankrupt: మన దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే పీకల్లోతులో అప్పులపాలయ్యాయి. వాటి ఆర్థిక పరిస్థితి.. ముందు ముందు మరింత క్షీణించే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఏమంత గొప్పగా లేదు. ఈ మేరకు ఆర్బీఐ ఇటీవల ఒక కేస్ స్టడీని విడుదల చేసింది. స్టడీలో భాగంగా ఆర్బీఐ రూపొందించిన జాబితాలోని 10 రాష్ట్రాల్లో 5 చోట్ల…
Indian Economy: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఇండియన్ ఎకానమీ గతేడాది ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే.. ఆ ఆనందం మరెన్నాళ్లో ఉండేట్లు లేదు. వచ్చే ఏడాదిలోనే ఈ టైటిల్‌ని కోల్పోయే ఛాన్స్ కనిపిస్తున్నాయి. కొవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థలో కాస్త సానుకూల వాతావరణం నెలకొన్నప్పటికీ ఈ ప్రయోజనాలను అధిక రుణ భారం మరియు పెరుగుతున్న ఖర్చులు క్షీణింపజేస్తున్నాయని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డమన్ శాక్స్ పేర్కొంది.
Special Story on Solar Power in India: మన దేశంలో సరికొత్త సౌర చరిత్ర ప్రారంభమైంది. దీంతో.. కరంట్ కోసం భవిష్యత్తులో బొగ్గు పైన మరియు శిలాజ ఇంధనాల పైన ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఈ సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో ఇండియా.. సోలార్ పవర్ జనరేషన్ ద్వారా 4.2 బిలియన్ డాలర్ల ఇంధన ఖర్చును తగ్గించుకోగలిగింది. 19.4 మిలియన్ టన్నుల బొగ్గును కూడా ఆదా చేసుకుంది.
Commercial Vehicles: కమర్షియల్ వెహికిల్స్‌ని ఒక్కో దేశంలో ఒక్కో రకంగా డిఫైన్ చేస్తుంటారు. సహజంగా.. సరుకు రవాణాకు లేదా ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగించే వాహనాలను కమర్షియల్ వెహికిల్స్ అంటారు. ట్రక్కులు, వ్యాన్లు, బస్సులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, మోటర్ సైకిల్ ట్యాక్సీలు వంటివాటిని వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు రానున్న కొన్నేళ్లలో భారీగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Elon Musk-Twitter Deal Details: ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్వి్ట్టర్‌ను కొనుగోలు చేయటం వారం పది రోజుల నుంచి ప్రపంచం మొత్తం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆ సామాజిక మాధ్యమాన్ని తాను డబ్బు సంపాదన కోసం సొంతం చేసుకోలేదని కొత్త యజమాని చెప్పటం కొంత ఆశ్చర్యకరంగానే అనిపించింది. ఎందుకంటే.. ట్విట్టర్‌ను తన వ్యాపార సామ్రాజ్యంలో కలుపుకునేందుకు ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు చెల్లించారు.
Special Story on JJ Irani: మన దేశం మర్చిపోలేని పారిశ్రామికవేత్తల్లో జమ్‌షెడ్ జె ఇరానీ ఒకరు. జేజే ఇరానీగా, స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారు. టాటా స్టీల్ కంపెనీ గొప్పతనంతోపాటు భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటారు. 8 గంటల పని సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం ఇతర కంపెనీలకు బెంచ్‌మార్క్‌లాగా నిలవటం విశేషం. కేవలం ఇండస్ట్రియలిస్ట్‌గానే కాకుండా స్పోర్ట్స్‌మ్యాన్‌గా, స్టాంపులు-నాణేల సేకరణకర్తగా తన అభిరుచులను చాటుకున్నారు. తుది శ్వాస విడిచే వరకు క్రికెట్‌ను…
Chillapalli-The Vintage Weavers: మగువలకు చీరలంటే మక్కువ. అది తెలుగువారికి మరింత ఎక్కువ. ఎందుకంటే శారీస్ లేడీస్ చక్కదనాన్ని పెంచుతాయి. వాళ్లకు నిండుదనాన్ని నింపుతాయి. అమ్మతనాన్ని అద్దుతాయి. మహిళల జీవితంలోని మధురమైన ఘట్టాలన్నీ చీరలతో ‘‘ముడి’’పడి ఉన్నాయి. మనువు ముహూర్తం మొదలుకొని.. ముత్తైదువుతనం వరకు, నిశ్చితార్థం నుంచి శ్రీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ వాళ్ల సంతోషానికి చీరలు అద్దంపడతాయి. ఇలా చెప్పుకుంటూపోతే చీరలోని గొప్పతనం
Special Story on RATAN TATA: నమ్మకంతో కూడిన నాయకత్వం.. టాటా గ్రూపు నినాదం. ఈ నమ్మకానికి నైతిక విలువలను జోడించారు రతన్ టాటా. 1868లో అంటే 154 ఏళ్ల కిందట ఒక ‘స్టార్టప్’గా ప్రస్థానం ప్రారంభించిన టాటా గ్రూపు ఇప్పుడు గ్లోబల్ కంపెనీల్లో ఒకటిగా ఊహించని స్థాయికి ఎదిగింది. దీని వెనక సంస్థ వ్యవస్థాకుడు జెమ్ షెట్ జీ టాటా కృషి ఎంత ఉందో ఆయన మునిమనవడు రతన్ టాటా పట్టుదలా అంతే ఉంది.