రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Npdcl, Spdcl తో పాటు కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకు…
Bhatti Vikramarka : రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న…
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మెకు రెండు సంఘాలు మద్దతు తెలుపుతుండగా.. కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-82)తో పాటు మరో సంఘం మద్దతు ప్రకటించాయి. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఎస్మా కింద పంజాగుట్ట పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు తెలిసింది.
పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన పదిరోజుల్లో 3,52,433 దరఖాస్తులు వచ్చాయి. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 2 నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా తొలి పదిరోజుల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ…