స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. దీంతో, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మిషన్ విజయవంతంగా పూర్తయింది. వీరి రాకపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లారు సునీతా విలియమ్స్. అయితే వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకుపోయిరు. ఆమెను తిరిగి తెలుసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన అవేవి సత్ఫాలితాలు ఇవ్వలేదు. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు ఎట్టకేలకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమిపైకి తిరిగి వచ్చారు. భూ…
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద ల్యాండ్ కాబోతుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా రానున్నారు.
PM Modi: దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. సునీతాతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’లో కొన్ని నెలలుగా చిక్కుబడిపోయారు. వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ ‘‘స్టార్ లైనర్’’లో సాంకేతిక సమస్యలు ఏర్పడం, హీలియం లీకేజీ, థ్రస్టర్ల వైఫల్యం వంటి సమస్యలను ఎదుర్కోవడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద ల్యాండ్ కాబోతుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా రానున్నారు. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లిన పలువురు కూడా వారితో వస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నాసా లైవ్ షో ఏర్పాటు చేసింది.
ప్రపంచ మంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడమే. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనున్నది. సునీతా రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావడానికి ప్రయోగించిన క్రూ డ్రాగన్ (స్పేస్‌క్రాఫ్ట్) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించింది. డాకింగ్ ప్రక్రియ కూడా ఈరోజు (మార్చి 16) పూర్తయింది. అన్నీ అనుకూలిస్తే ఇద్దరూ మార్చి 19న భూమికి…
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతోంది నాసా. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది. సునీత విలియమ్స్‌ను తీసుకొచ్చేందుకు నాసా వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. క్రూ-10 ప్రయోగానికి నాసా రెడీ అవుతోంది. సాంకేతిక సమస్యతో…
Starlink Link India: భారత మార్కెట్లో SpaceX సంస్థకు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బాండ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న సంగతి విధితమే. అయితే, దీని అధిక ధర కారణంగా సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడం కష్టంగానే కనపడుతుంది. స్టార్ లింక్ (Starlink) సేవలు ప్రస్తుతం ఉన్న జియో, ఎయిర్టెల్ లాంటి ప్రముఖ బ్రాడ్‌బాండ్ సేవల కంటే 10 నుండి 14 రెట్లు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తక్కువ భూమి కక్ష్య…
Starlink: ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌తో రిలయన్స్ గ్రూప్‌కి చెంది జియో జట్టు కట్టింది. ఇప్పటికే, ఎయిర్‌టెల్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలోని రెండు టెలికాం దిగ్గజాలు స్పేస్ ఎక్స్‌తో భాగస్వామ్యం కాబోతోన్నాయి.
Airtel: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌తో భారతీ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ వెల్లడించింది. భారతదేశంలో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను తీసుకురావడానికి ఎయిర్‌టెల్ స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.